16న గ్రామీణ బంద్, సమ్మెను జయప్రదం చేయండి

– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
నవతెలంగాణ –  భువనగిరి రూరల్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ కూలీల, రైతుల, కార్మికుల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 16 న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామీణ బంద్, సమ్మెను కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య, జిల్లా సహాయ కార్యదర్శి కూకుట్ల చొక్కా కుమారి పిలుపునిచ్చారు. బుధవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని చీమలకొండూరు, ముత్తిరెడ్డిగూడెం గ్రామాలలో గ్రామీణ గ్రామీణ బంద్, సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంజయ్య, చొక్కా కుమారి మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎత్తివేయాలని కుట్రలో భాగంగా ప్రతి సంవత్సరము బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ కొత్త కొత్త జీవోలు తెస్తూ ఉపాధి హామీలో పని చేస్తున్న కూలీలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ఉపాధి హామీ పని ప్రదేశాల్లో కూలీలను రెండుసార్ల ఫోటోలు తీయాలని, డ్రోన్ కెమెరాలు వాడాలని, ఆధార్ అనుసంధానం ఉంటేనే కూలీలకు డబ్బులు చెల్లించాలి మోడీ ప్రభుత్వము జీవోలు తీసుకురావడం చాలా దారుణమని అన్నారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం పని ప్రదేశాల్లో మౌలిక వసతులు ఎత్తివేసిందని, వారం వారం బిల్లులు చెల్లించడం లేదని దీనితో ఉపాధి కూలీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వము పని ప్రదేశాల్లో మౌలిక వసతులు కల్పించి, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించి, రోజు కూలి రూ.800 రూపాయలు ఇవ్వాలని, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలను అరికట్టి ఆహార వస్తువులు నిత్యవసరాలపై జిఎస్టి ఉపసంహరించుకొని పెట్రోల్ డీజిల్ కిరోసిన్ వంట గ్యాస్ లపై కేంద్ర ఎక్సైజ్ సుంకం తగ్గించాలని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ విస్తరించాలని రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యవసర వస్తువులు అందించాలని ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీస వేతనము రూ.26 వేల రూపాయలతో పాటు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం, నాలుగు లేబర్ కోడులను రద్దు కోసం, 2022 విద్యుత్తు సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, 2013 భూ సేకరణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, అందరికీ విద్యా, వైద్యం, ఉపాధి, కల్పించాలని డిమాండ్స్ తో ఈనెల 16న నిర్వహిస్తున్న గ్రామీణ బంద్ మరియు సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అంజయ్య, చొక్కా కుమారి పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో రెండు గ్రామాలకు సంబంధించిన ఎ. సత్యమ్మ , పి. బాలస్వామి, జె. భవాని, పి .నరసింహ, కే. యశోద, యం లూర్దయ్య, ఊ. భవిత, పి అంజయ్య, ఎన్  పద్మ, జె గౌరమ్మ, ఎం జ్యోతి, ఎం రేణుక, ఏ  సునీత, పి సంతోష, ఏ. గీత, అమృత, సారమ్మలు  పాల్గొన్నారు.
Spread the love