Wednesday, June 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాలలో ముమ్మరంగా కొనసాగుతున్న గ్రామసభలు

గ్రామాలలో ముమ్మరంగా కొనసాగుతున్న గ్రామసభలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని పలు గ్రామాలలో ప్రత్యేకంగా 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా జిపి గ్రామాలైన పడంపల్లి సర్పంచ్ వాగ్మారే విజయ కుమారి సంజు, మైబాపూర్ గ్రామ సర్పంచ్ బశ్యవ్వ రెడ్డి, మథుర తాండా సర్పంచ్ అనిత మోహన్, నాగల్ గావ్  సర్పంచ్ జాదవ్ సునంద విజయ్ పటేల్, మహ్మదాబాద్ సర్పంచ్ సుర్నార్ శకుంతల బాలు, పెద్ద ఏడ్గి సర్పంచ్ అస్పత్ వార్ అనిల్ కుమార్, సోపూర్ సర్పంచ్ తుకారాం, వజ్రఖండి సర్పంచ్ సింత్రాళే సావిత్రి సోపాన్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో ప్రత్యేక గ్రామ సభలు ఏర్పాటు చేశారు.

ఈ గ్రామ సభలలో జిపి కార్యదర్శులు పలు అంశాలు చదివి వినిపించారు. వివిధ గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ రాబోవు వర్షాకాలంలో ముందస్తుగా తీసుకోవలసిన జాగ్రత్తలు, పంట మార్పిడిపై రైతులకు అవగాహన, విద్యుత్ నియంత్రికల రిపేర్లు, భూగర్భ జలాలు పెంచేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు,, ప్రభుత్వ ఖాళీ స్థలాలలో మొక్కలు నాటడం, శానిటైజేషన్, త్రాగు మరియు సాగునీరు, ఆత్మహత్యల నివారణ, డ్రగ్స్ వాడకం ప చర్యలు, రోడ్డు భద్రత నివారణ చర్యలు, విపత్తు నిర్వహణ చర్యలు తదితర అంశాలపై  తీసుకోవల్సిన చర్యలు, అంశాల పైన చర్చించారు. గ్రామస్థాయిలో జరిగే వివిధ కార్యక్రమాలకు అభివృద్ధికి తీర్మానాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల జిపి కార్యదర్శులు, జిపి కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు, ఆశా కార్యకర్తలు,  అంగన్వాడీ టీచర్లు , తదితరులు పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -