రెంజల్ మండలంలో గ్రామసభలు

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండలంలో గురువారం పలు గ్రామాలలో గ్రామ సభలను నిర్వహించినట్లు గ్రామాల ప్రత్యేక అధికారులు పేర్కొన్నారు. ఈనెల 7 నుంచి 14 వరకు ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాల లో భాగంగా గ్రామాలలో అభివృద్ధి పనులను చేపట్టిన పారిశుద్ధ కార్మికులకు ఘనంగా సన్మానించడంతోపాటు, సమస్యలపై గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామసభల్లో గ్రామంలో అత్యవసర సమస్యలపై చర్చించినట్లు వారు పేర్కొన్నారు. మండలంలో వీరన్న గుట్ట, కునేపల్లి, బోర్గం, తాడు బిలోలి, వీరన్న గుట్ట తండా, రెంజల్, దూపల్లి తదితర గ్రామాలలో గ్రామ సభలను నిర్వహించారు.
Spread the love