శంకరపట్నంలో ఘనంగా బక్రీద్ వేడుకలు

నవతెలంగాణ – శంకరపట్నం
ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం అల్లాహు పంపిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరని ఎండి కాజా మొహినిద్దీన్ అన్నారు.సోమవారం శంకరపట్నం మండలం కేశవపట్నం లో ఈద్గా వద్ద ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈద్గా వద్ద ముస్లింలందరూ నమాజ్ చదివి దువా పాటించారు. ఈ సందర్భంగా జామా మజీద్ కమిటీ అధ్యక్షులు ఎండి ఖాజా మొయినొద్దీన్ మాట్లాడుతూ,ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం, అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరని ఆయన మక్కా పట్టణాన్ని నిర్మించి, అక్కడే నివాసం ఉంటూ అల్లాహ్‌ను ఆరాధించడానికి ప్రార్థనా మందర్ కాబా నిర్మించి దైవ ప్రవక్తగా పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. అయితే ఇబ్రహీం దంపతులు ఎంతో కాలం తర్వాత ఓ బిడ్డకు జన్మినిస్తారు. తనకు ఇస్మాయిల్ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటారు. అయితే ఓ రోజు ఇబ్రహీంకు తన కుమారుడిని చంపుతున్నట్లు,కలలో కనిపిస్తుంది దీంతో అల్లాహ్ ఖుర్బానీ కోరుతున్నాడేమో అని భావించి ఒంటెను బలి ఇస్తారు. అయినా మళ్లీ అదే కల రావడంతో తన బిడ్డను బలిదానం కోరుకుంటున్నాడని, ఈ విషయాన్ని తన పుత్రుడికి చెబుతాడు తను కూడా అల్లాహ్ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమని చెబుతాడు దీంతో తన బిడ్డను బలి ఇచ్చేందుకు సిద్ధమవ్వగా,అప్పుడు అల్లాహ్ ప్రాణ త్యాగానికి బదులుగా ఓ జీవాన్ని బలి ఇవ్వాలని జిబ్రాయిల్ అనే దూత ద్వారా సందేశం పంపుతాడు అప్పటి నుంచి ప్రతి ఏటా బక్రీద్ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు మజీద్ కమిటీ సభ్యులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Spread the love