రెంజల్ మండలం తాడి బిలోలి గ్రామంలో సోమవారం బతుకమ్మ పండుగ వేడుకలను ఆడపడుచులు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా మారిన బతుకమ్మ పండుగ మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో గ్రామంలోని ఆలయాల ముందు బతుకమ్మ పాటలతో అలరించారు. గ్రామంలోని ప్రతి ఇంటి ఆడపడుచులు వివిధ రకాల పూలను సేకరించి ఒకరిపై ఒకరు పోటీ పడుతూ బతుకమ్మలను తయారు చేయడం విశేషం. అనంతరం బతుకమ్మలను సమీపంలోనున్న అల్లి సాగర్ లిఫ్ట్ కాలువలో నిమజ్జనం చేశారు. వాత ఆడపడుచులు ఆలయాల వద్దకు వచ్చి బతుకమ్మ పాటలు పాడుతూ పలువురిని ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెలుమల సునీత నరసయ్య, ఎంపీటీసీ చింతకుంట లక్ష్మి లింగారెడ్డి, ఉప సర్పంచ్ మస్కూరి లక్ష్మి, స్థానిక నాయకులు నరసయ్య, మధు, శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ రావు, లింగాల అబ్బన్న, గ్రామంలోని మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు.