బీజేపీలో చేరిన బల్వంతపూర్ గ్రామ యువకులు

నవతెలంగాణ- దుబ్బాక రూరల్ :
దుబ్బాక మండలం బల్వంతపూర్ గ్రామానికి చెందిన సుమారు 20 మంది యువకులు సోమవారం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు  నివాసంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా యువతకు ఎమ్మెల్యే రఘునందన్ రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యాయని, ఉద్యోగాలు లేక యువత, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. తాజా మేనిఫెస్టో నిరుద్యోగులకు ఉసే లేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమేష్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు
Spread the love