నవతెలంగాణ -డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ వీడి బీఆర్ఎస్ లో పలువురు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ చేరినవరందరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్లాపూర్ గ్రామ యువకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని, కేసీఆర్ ప్రభుత్వం గొప్పగా పాలిస్తున్నదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ ప్రగతిశీల ఆలోచనా విధానానికి తామంతా ఆకర్షితులమై బిఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ దార్శనిక పాలనతో ప్రతి పల్లెకూ అభివృద్ధి ఫలాలు, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు.గత కోన్ని రోజులుగా బిఆర్ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీ లో చేరుతున్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారు
మల్లాపూర్ గ్రామానికి చెందిన బిజెపి పార్టీ నుండి దర్శనం సురేష్, దర్శనం శేఖర్, కలిగోట్ గంగాధర్, సట్ల ఆశన్న, రోలం భూమయ్య, మల్లయ్య, ఇందల్ వాయి మండలసర్పంచుల ఫోరం అధ్యక్షులు లోలం సత్యనారాయణ, మండల అధ్యక్షులు చితం శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు సర్పంచులు ఉపసర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.