నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండల కేంద్రానికి సమీపంలో గాంధారి నుండి బూర్గుల్ వెళ్తున్న ఆటో తిప్పారం బ్రిడ్జివద్ద మలుపు ఉండడంతో అటో అదుపుతప్పి ప్రమాదం సంభవించింది అనిస్థానికులు తెలిపారు. ఆటోలో ప్రయాణిస్తున్న పదిమంది అందులో ఆరుగురు స్వల్ప గాయాలతో బయటపడగా నలుగురికి తీవ్రగాయాలు కావడంతో కామారెడ్డి ఏరియా హాస్పిటల్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.