
నవతెలంగాణ -కంటేశ్వర్
ఆకాశాన్ని అంటుతున్న నిత్యవసర ధరలు ఆకలి చావుల చేస్తున్న నిరుపేదలను ప్రభుత్వం స్పందించాలని ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన సోమవారం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఐద్వా నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత మాట్లాడుతూ.. కూలి పని చేసేవాడికి. కూలి పెరగలేదు కానీ చిన్న ఉద్యోగస్తులకు జీతాలు నెలకు సరిగ్గా రావట్లేదు కానీ కనీసం కూరగాయలతోనే పిడికెడు మెతుకులు తిందామంటే కూర కాయలు కూడా కొనలేని పరిస్థితుల్లో నిరుపేదలు రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తే రైతులకు రుణమాఫీలు చేస్తే నిత్యావసర ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయని జీఎస్టీ పేరుమీద ప్రజలను ఆకలి చావులకు గురి చేస్తున్న ప్రభుత్వాలు నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని తగ్గించాలని లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని ఐద్వా మహిళా సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, రజియా, లావణ్య, నగర నాయకులు కళావతి,సుబ్బలక్ష్మి నీతిమ, కళ మంజుల తదితరులు పాల్గొన్నారు.