నిజామాబాద్ కలెక్టరేట్ సూపరింటెండెంట్ మృతి..

నవతెలంగాణ – కంటేశ్యర్: నిజామాబాద్ లోని కలెక్టరేట్లో సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న తహసీల్దార్ మెతుకు రమేష్ (42) సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. రెవెన్యూ శాఖలో టైపిస్టుగా చేరి ప్రస్తుతం తహసీల్దార్ గా పని చేస్తున్న మెతుకు రమేష్ సీనియారిటీ పరంగా త్వరలో ఆర్డీవో గాకూడా పదోన్నతి పొందాల్సి ఉంది. నిజాంబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో అపార్ట్మెంట్లో ఉండేవాడు. అయితే సోమవారం తెల్లవారుజామున  మెతుకు రమేష్ కు గుండెపోటు రాగా అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.సౌమ్యుడిగా వివాదరహితుడిగా ఉన్న మెతుకు రమేష్ (42) ఇందల్వాయి తహసీల్దారుగా పని చేసిన సమయంలో ఏసీబీ దాడు కలకలం రేపాయి. ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ యజమానికి చాలాన్ వేయగా దానిని చెల్లించకుండా తనను తహసీల్దార్ లంచం డిమాండ్ చేశాడని ఫిర్యాదు చేయడంతో ఏసీబీ సోదాలను నిర్వహించింది. సోదాల్లో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఏసీబీ కేసు నమోదు చేయలేకపోయింది. ఈ క్రమంలోనే రమేష్ ను ఇందల్వాయి నుంచి పోతంగల్ కు బదిలీ చేశారు.ఇటీవల అక్కడి నుంచి కలెక్టరేట్ కు బదిలీ చేయగా తాను తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఆ బెంగతోనే గుండెపోటు వచ్చి ఉంటుందని రెవిన్యూ అధికారులు, కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తహసీల్దార్ మెతుకు రమేష్ మరణం పట్ల జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నిజామాబాద్ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమన రెడ్డి, ప్రశాంత్, తదితరులు సంతాపం తెలిపారు.
Spread the love