అంబులెన్స్ సహాయం అందించిన రోటరీ క్లబ్

నవతెలంగాణ- కంటేశ్వర్
దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం కొరకు హైదరాబాద్ నందుగల స్పర్శ కేంద్రానికి వర్ని మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన షేక్ జలీలకు అంబులెన్స్ లో పంపించటానికీ సహాయ నిమిత్తం రోటరీ క్లబ్ నిజామాబాద్ వారు ముందుకు వచ్చి వారికి ఆ కేంద్రానికి పంపించడానికి సహాయం అందించాలని క్లబ్ అధ్యక్షులు సతీష్ షాహ తెలిపారు. ఈ అంబులెన్స్ సౌకర్యం అనునది రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సభ్యులు శ్యామ్ అగర్వాల్ తన హృదయ దాతృత్వంతో ముందుకు వచ్చి అందించడం జరిగినది. ఇలా ప్రతి నెల దీర్ఘకాలిక సమస్యల ఉపశమన కేంద్రమైనటువంటి స్పర్శ ఆస్పత్రికి హైదరాబాద్ స్పర్శ కేంద్రం వారు నిజామాబాద్ నకు చెందిన రోగులు పేదవారైనటువంటి వారిని తెలియజేయడం వలన నిజామాబాద్ సభ్యులు కలిసి పంపించడంలో సహాయం అందిస్తారని తెలపడం జరిగింది. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్ విశాల్ ఆకుల,శ్యామ్ అగర్వాల్, వి.శ్రీనివాసరావు,జగదీశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love