తెలంగాణ యూనివర్సిటీ లో టీఎస్పీఎస్సీ దిష్టిబొమ్మ దహనం… 

– ఒక్కొక్క గ్రూప్-1 అభ్యర్థికి లక్ష రూపాయలు కేటాయించాలి..
– ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ అధ్యక్షులు ప్రసాద్ డిమాండ్ ..
నవతెలంగాణ- డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ఏర్పడి పది ఏళ్ళు  గడిచిన రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతుందని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షుడు ప్రసాద్ అన్నారు.తెలంగాణ యూనివర్సిటీ లో తెలంగాణ యూనివర్సిటీ లో టీఎస్పీఎస్సీ దిష్టిబొమ్మ దహనం చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కొక్క గ్రూప్-1 అభ్యర్థికి లక్ష రూపాయలు కేటాయించాలని ఎస్ ఎఫ్ ఐ డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు.  సొంత రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు ,నియామకాలు అందుతాయని అనుకుంటే కేవలం కల్వకుంట్ల వంశానికే అన్ని సాకల సౌకర్యాలు అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గ్రూప్ 1పరీక్ష  పేపర్ లీకేజ్ వల్ల విద్యార్థులకు తివ్ర నష్టం జరిగిందని అయినప్పటికీ తిరిగి నిర్వహించడంతో మళ్లీ విద్యార్థులు రాయడం జరిగిందన్నారు. మళ్లీ ఇప్పుడు రెండవసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దవ్వడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని  తక్షణమే ప్రిలిమ్స్ పరీక్ష రద్దుకు ప్రభుత్వమే బాధ్యత వహించి టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యానికి ఒక్కొక్క గ్రూప్1 అభ్యర్థికి లక్ష రూపాయలు కేటాయించి , మండలాలలో జిల్లాలలో స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే  కమిషన్ను ప్రక్షాళన చేసి బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డిని బర్తరప్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనియెడల రానున్న రోజుల్లో భారీ ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నవీన్, రాకేష్ , గణేష్ , చిత్రబ్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love