జిజిహెచ్ లో ఘనంగా సపోస్ క్రిస్మస్ వేడుకలు 

– క్రిస్మస్ కేక్ కట్ చేసి సంబరాలు యేసుక్రీస్తు జనన నాటక ప్రదర్శన
– క్రిస్మస్ క్యారల్స్ ఆలపించిన సి ఎస్ ఐ కోయర్ బృందం
నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కరుణమయుడు ఏసు క్రీస్తు జన్మదిన ముందస్తు వేడుకల ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని కాన్ఫరెన్స్ హాలులో ఈ వేడుకల ను నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే క్రిస్మస్ సీజన్ ను పురస్కరించుకొని ఈ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించారు.  ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు ఒక సాధారణ పశువుల పాకలో జన్మించినా తన వ్యక్తిత్వం తో లోకానికి రారాజు అయినారని, యేసుక్రీస్తు మరణ సమయం లో కూడా కరుణ చూపించారని.. అందుకే ఆయన లోకానికి ప్రభువు అయ్యారని తెలిపారు. ఈ ఆసుపత్రి లో జనవరి 1వ నూతన సంవత్సర వేడుకల మొదలు కొని అన్ని వర్గాల వండుగలను జరుపుకుంటూ చివరి నెల డిసెంబర్ లో క్రిస్మస్ వేడుకలతో సంవత్సరం ముగుస్తుందని హర్షం వ్యక్తం చేశారు.ఆసుపత్రి సిబ్బంది. నర్సింగ్ విద్యార్థులు ఏసు క్రీస్తు  జన్మ వృత్తాంతంనకూ సంబంధించిన రూపకాన్ని ప్రదర్శించి, విశేషంగా ఆకట్టుకున్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. అదేవిధంగా సి ఎస్ ఐ చర్చ్  బృందం ఆధ్వర్యంలో ఆసుపత్రి సిబ్బంది తో కలిసి సంగీత వాయిద్యాలతో క్రిస్మస్ గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ప్రతిమ రాజ్, జాన్, సుకుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ఇంగ్లీష్, వైద్యులు, నర్సింగ్ సూపరింటెండెంట్స్, నర్సింగ్ ఆఫీసర్స్  ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love