
మే డే సందర్భంగా చిన్నకోడూరు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో కార్మికులు, కర్షకులు మే డే జెండా ఆవిష్కరించి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకించి కార్మిక హక్కులను, రైతుల హక్కులను చట్టసభల నుంచి పూర్తిగా తొలగించుకుంటూ అభివృద్ధి మూసుగులో ప్రజలను తప్పుదోవ పట్టించుకుంటూ పాలకవర్గం ఆధిపత్యం చేస్తుందని అన్నారు. గత కొన్ని దశాబ్దాల నుంచి కార్మికులు, రైతులు, కూలీలు కొట్లాడి సాధించుకున్న చట్టాలను మోడీ ప్రభుత్వం చట్టసభలలో ఎటువంటి చర్చలు జరపకుండా ఉత్పత్తి శ్రమజీవుల పొట్టన కొడుతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రానున్న రోజుల్లో కార్పొరేట్ పెట్టుబడిదారీ విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చల్లారపు తిరుపతిరెడ్డి, బంక రాజయ్య, బాలయ్య, యాదగిరి, సుధాకర్ రెడ్డి, రంగయ్య, లచ్చయ్య, మల్లయ్య, కత్తి సత్తయ్య, చంద్రయ్య కిషన్, శంకరయ్య, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.