నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిం చారు. పలు ప్రాంతాల్లో పలువురు జాతీయ జెండాలు ఎగుర వేశారు. లింగంపల్లి, మియాపూర్, మాదా పూర్, కొండాపూర్ డివిజన్లలోని పలు ప్రాంతాలలో జాతీయ జెండాను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ ఆవిష్కరించారు.
కొండాపూర్ డివిజన్‌లో…
75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్ధిక్‌నగర్, అంజయ్య నగర్, బంజారా నగర్, రాజీవ్ నగర్, న్యూ పీజేఆర్ నగర్, ఓల్డ్ పీజేఆర్ నగర్, మార్తాండ్ నగర్, హనీఫ్ కాలనీ, రాజా రాజేశ్వరి నగర్ కాలనీ, ప్రేమ్ నగర్ ఏ, బీ బ్లాకులలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ జాతీయ జెండా ఎగురవేశారు.
గచ్చిబౌలి డివిజన్‌లో…
నల్లగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గచ్చి బౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయి బాబా, సీనియర్ నాయకులు గణేష్ ముదిరాజ్ పాల్గొని ఆటల పోటిల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.