మండల వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండల వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ తోట రవీందర్, మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో పోరిక జై సింగ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లు రణదీర్, రంజిత్, ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం లకావత్ పద్మ, మండలంలోని 18 గ్రామపంచాయతీలో సర్పంచులు, మండల విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓ రేగా కేశవరావు, కాటాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో హెచ్ఎం, యువజన సంఘాలు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్ లు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు. భారత రాజ్యాంగంలోని విలువలు హక్కుల కోసం పాటుపడాలన్నారు. స్వాతంత్రం కోసం మన జాతీయ పోరడానికి స్ఫూర్తి ఇచ్చిన సత్యం అయింసా శాంతి సంఘీభావం సాత్విక సౌభ్రాతృత్వం యొక్క గొప్ప ఆదర్శ తిరిగి అంకితం చేసే రోజుగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు యువజన సంఘాల నాయకులు విద్యార్థులు వివిధ శాఖల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love