
మహిళలకు ముగ్గుల పోటీలు మండలంలోని పసర గ్రామం లోని సుందరయ్య నగర్ లో ఆదివారం భోగి సంక్రాంతి సంబరాలను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భోగి సంక్రాంతి పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని సిపిఎం పార్టీ పసర గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఎంతో ఉత్సాహంగా ముగ్గుల పోటీలలో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేసి ఆహ్లాద పరిచారు . కాలనీలో సిపిఎం పార్టీ గ్రామ కమిటీ కార్యదర్శి కడారి నాగరాజు అధ్యక్షతన జిల్లా కమిటీ సభ్యుడు గొంది రాజేష్ పల్లపు రాజు గరుగు అయిలయ్య మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు మంచాల కవిత శాఖ కార్యదర్శి మన్సోజు బ్రహ్మచారి మల్లారెడ్డి కొమ్ము రాజు ముల్కోజు శ్రీనివాస్ కొండయ్య అంజద్ బ్రహ్మచారి తదితరులు ఇంటింటికి తిరుగుతూ ముగ్గుల సెలక్షన్ చేపట్టారు. ముగ్గులు వేయడంలో ప్రతిభ కనబరిచిన వారికి ఈనెల 16వ తారీకు బహుమతులు ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు సువర్ణ సరళ అచ్చమ్మ నాగేశ్వరమ్మ అనూష సోమమ్మ సుశీల సమ్మక్క రమాదేవి కవిత తదితరులు పాల్గొన్నారు.