ఘనంగా విశ్వహిందూ దినోత్సవ కార్యక్రమం

– జెడ్ పి హెచ్ స్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాందాస్

నవతెలంగాణ- నెల్లికుదురు
మండలంలోని ఆలేరు గ్రామ జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా విశ్వహిందూ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాందాస్ తెలిపాడు బుధవారం ఆలేరు ప్రభుత్వ పాఠశాలలో విశ్వహిందూ దినోత్సవాన్ని పురస్కరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి వాటిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందీ ఉపాధ్యాయురాలు మహేశ్వరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు మొదటగా జ్యోతి ప్రజ్వల నిర్వహించి మాట్లాడారు హిందీ కృత్య మేల నిర్వహణ హిందీ భాష గొప్పదనం గూర్చి ఉపన్యాసాలు పాటలు మరియు నృత్య కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థులు ఎంతో ఉత్సవంతో ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది భాష గురించి నేర్చుకున్నారు అని అన్నారు జాతీయ భాష ఇది ప్రతి భారతీయుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని హిందీ ప్రతి విద్యార్థి నేర్చుకున్నట్లయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏ లాంటి కార్యక్రమాలలోనైన పాల్గొని సమస్త విషయాలను నేర్చుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో బి బిక్షపతి కే బిక్షపతి జబ్బర్ నరసయ్య జయప్రకాష్ మోహన్ బాబు స్రవంతి మహేశ్వరి కిషన్ అనిత తదితరులు పాల్గొన్నారు.
Spread the love