2000 మంది లబ్ధిదారులకు ఇంటి నివేశన స్థలాలు ఇండ్లు మంజూరు చేయండి

 – సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు డిమాండ్.
నవతెలంగాణ  – భువనగిరి: భువనగిరి పట్టణంలోని రెండు వేల మందికి ఇంటి స్థలాలు ఇండ్లు లేవనే విషయాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించి అర్హుల జాబితాను తయారు చేశారని వీరందరికీ భువనగిరి పట్టణం, మండల పరిధిలోగల ప్రభుత్వ భూములు సర్వే చేయించి ప్రతి కుటుంబానికి 120 గజాల చొప్పున ఇంటి నివేశన స్థలాలు ఇచ్చి ఇండ్లు మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు డిమాండ్ చేశారు.  మంగళవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో లబ్ధిదారుల సమావేశం సిపిఐ భువనగిరి పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్ అధ్యక్షతన సమావేశం  నిర్వహించారు. లబ్ధిదారులు ఇప్పటికే తహసిల్దార్, కలెక్టర్ కి వ్యక్తిగత దరఖాస్తులు సమర్పించారని వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటి కిరాయిలు చెల్లించలేక ఇంటి కిరాయిలతోపాటు కుటుంబాలను పోషించుకోలేక చాలా సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ మాట్లాడుతూ ఇంటి స్థలాలు ఇచ్చేంతవరకు ఆందోళన చేయాలని ఎన్నికలు ముగిసిన తర్వాత లబ్ధిదారులు ఆందోళనకు సిద్ధం కావాలని కోరారు. లబ్ధిదారుల సమావేశంలో మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు సోమన సబిత సిపిఐ భువనగిరి పట్టణ సహాయ కార్యదర్శి చింతల మల్లేశం తో పాటు లబ్ధిదారులు మల్లారెడ్డి, ఆనంద్, కళాసికం రాంబాబు, పోత్నక్ బాలమని, గునూరు స్వర్ణలత, జహంగీర్ బాబా, రేష్మ, చొప్పరి వరలక్ష్మి, ఎర్రగుంట రాజ్యలక్ష్మి, గుర్రాల నరసింహ, ఎండి నయీముద్దీన్ మధు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Spread the love