జన్నారంలో ఘనంగా తీజ్ ఉత్సవాలు..

Great Teej celebrations in Jannaram..నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలో లంబాడి కులస్తులు తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బంజారా సేవా సంఘం జన్నారం మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జన్నారం మండలం పట్టణంలోని జువ్విగూడా గ్రామంలో ఉన్న శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబ దేవి మాతకు ఆ సంఘం నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువతులు వెదురు బుట్టలలో  ఉంచిన గోధుమ వరి మొలకలతో  నృ త్యాలు చేస్తూ ర్యాలీగా  జువ్విగూడ నుండి పట్టణంలోని ధర్మారం చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో  సంఘం నాయకులు జాదవ్  సందేశ్   ప్రకాష్ నాయక్, బివిఎస్ నాయక్, బిమ్లాల్ నాయక్, రాములు నాయక్, రామ్ కిషన్ నాయక్, సంతోష్ నాయక్ వివిధ గ్రామాలకు చెందిన బంజారా సేవా సంఘం నాయకులతో పాటు మాజీ సర్పంచ్ జక్కు భూమేష్ పాల్గొన్నారు.

Spread the love