నవ తెలంగాణ-భువనగిరి రూరల్
అన్ని శాఖల అధికారులు ఒకే దగ్గర కూర్చొని ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేయడం గొప్ప విషయం, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు సమయం ఉండవలనా సమయానికి రాలేకపోతున్నట్లు, ప్రజావాణి కార్యక్రమాన్ని ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు, లేదా మధ్యాహ్నం ఒకటి గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించాలని కలెక్టర్ కు యాదగిరిగుట్ట మండలం రామాజీపేట కు చెందిన మక్కల దుర్గయ్య వినతిపత్రం అందజేశారు. మోటకొండూరు మండలం చాడ గ్రామంలో చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని బీబీనగర్ కు చెందిన పిట్టల అశోక్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. గత సంవత్సరం పోచంపల్లి మండలం లో పెద్ద చెరువు , జూలూరు చెరువులలో భారీ స్థాయిలో మట్టి తరలించి గుత్తేదారు సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు చేపట్టడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని జలవనరులపై ధ్వంసమై పర్యావరణం దెబ్బతింటుందని వినతిపత్రంలో పేర్కొన్నారు. అక్రమంగా మట్టిని తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వయోజన విద్యలోని మాజీ సాక్షర భారత్, ను తిరిగి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో టి రమేష్, అబ్దుల్ సలాం జంగయ్య లు అందజేశారు. అంగన్వాడీలకు పాత పద్ధతిలోనే ఎస్ఎస్సి అర్ధాత ప్రకారం ప్రమోషన్ కల్పించాలని, ప్రమోషన్ వయసు 50 సంవత్సరాలు వరకు పెంచాలని కోరారు. కార్యక్రమంలో ప్రజల నుంచి 46 దరఖాస్తులను స్వీకరించినట్లు, ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ రెవిన్యూ డివిషనల్ అధికారి శేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కృష్ణన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, కలెక్టరేట్ పరిపాల అధికారి జగన్మోహన్ ప్రసాద్, కలెక్టరేట్ సూపర్డెంట్ రామ్మూర్తి, ప్రజలు పాల్గొన్నారు.