మొరాకన్‌ కంపెనీతో జిఆర్‌ఎం భాగస్వామ్యం

హైదరాబాద్‌: జిఆర్‌ఎం ఓవర్సీస్‌ మొరాకన్‌ కంపెనీతో భాగస్వామ్యం కుదర్చుకోవడంతో ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో మరింత విస్తరించినట్లు ప్రకటించింది. ఎఫ్‌ఎంసిజి రంగంలోని జిఆర్‌ఎం ఓవర్‌సీస్‌ తాజాగా మోరాకోలోని సోలారిజ్‌ ఇన్వెస్ట్‌తో ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిపింది. దీంతో మొరకన్‌ వినియోగదారులకు తమ టనోష్‌ బ్రాండ్‌ బాస్మతి బియ్యాన్ని సరఫరా చేయనున్నట్లు పేర్కొంది. ఇందులో 1కిలో, 5కిలోల పరిమాణంలోని ప్యాకెట్లన ఎగుమతి చేయనున్నట్లు వెల్లడించింది. ఇంతక్రితం ఈ సంస్థ యెమెన్‌ నుంచి బిన్‌ అవాద్‌ అల్‌నకీబ్‌ గ్రూపు నుంచి 60 కోట్ల విలువ చేసే ఆర్డర్‌ను పొందింది.

Spread the love