ఖాతాదారుల మెరుగైన సేవలు ఉపయోగించుకోవాలని హలియా పోచంపల్లి బ్రాంచ్ బ్యాంక్ మేనేజర్ వి. ఎస్ కుమార్ కాసర్ల అన్నారు. మంగళవారం బ్రాంచ్ లో నిర్వహించిన ఖాతాదారుల సమావేశం లో అయన మాట్లాడుతూ బ్యాంక్ లో డిపాజిట్, లాకార్లు, రుణాలు, వంటి సదుపాయాలు వినియోగించుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఇన్సూరెన్స్ స్కీం లు వినియోగించుకోవాలని అన్నారు.వివిధ రకాల డిపాజిట్ ల మీద అన్ని బ్యాంకు లకన్నా ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయ్ అని ఖాతాదారులు వినియోగించు కోవాలి అని అన్నారు. సమావేశం లో బ్యాంక్ ఆడిటర్ జంగయ్య, సిబ్బంది మోహన చారి, రవీందర్ రెడ్డి, వెంకన్న, పవన్, శాహీన్, బాలు, సైదులు తదితరులు పాల్గొన్నారు.