
భిక్కనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పట్లురి హనుమంత్ రెడ్డి నియమితులైనట్లు పార్టీ వర్గాలు తెలిపారు. ఇంతకుముందు చైర్మన్ గా కొనసాగిన భగవంతరెడ్డి ఇటీవల మరణించిన విషయం తెలిసిందె. ఆయన స్థానంలో ప్రస్తుతం వైస్ చైర్మన్ గా కొనసాగుతున్న హనుమంత్ రెడ్డిని నియమించినట్లు, ఈ మేరకు వ్యవసాయ శాఖ నుండి ఉత్తర్వులు రానున్నాయని హనుమంతరెడ్డి పేరును ఎమ్మెల్యే గోవర్ధన్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపించినట్లు ఎమ్మెల్యే ప్రతిపాదనలను పరిగణంలోకి తీసుకొని ఆయనను చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. చైర్మన్ గా నియమితులవుతున్న సందర్భంగా ఆయనను పార్టీ వర్గాలు అభినందించాయి.