ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రేస్ పార్టీలకు బుద్ది చెప్పాలి: హరీష్ రావు

నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఈరోజు కామారెడ్డిలో బీఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మెనార్టీలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలో ఉన్న ప్రేమ రైతులపై లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే కరువు వచ్చిందన్నారు. సాగు నీరు లేక పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను పరమర్శించడానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు సమయం లేదా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మా నేతలను కొనొచ్చు కానీ.. కార్యకర్తలను కొనలేరని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు హామీ ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని హరీష్ రావు కోరారు.

Spread the love