జీ5 ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో డిఫరెంట్ వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్‌ను అలరించటానికి సిద్ధమైంది. అదే ‘‘మేము‘కాప్’లం’’. ఈనెల 22 నుంచి ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌పై మరింత ఆసక్తిని పెంచేలా ట్రైలర్‌ను విడుదల చేశారుమహదేవపట్నం అనే ప్రాంతంలో కథ మొదలవుతుంది. అయ్యగారు వారసుడొచ్చాడండోయ్.. అని పాలేరు అని అరిచి మరి చెబుతాడు. అప్పుడు గజపతిరాజు పాత్రలో నటించిన నాగబాబు ఆనందపడతాడు. సలార్‌రాజు తన వారసుడు అని ప్రకటిస్తాడు. అయితే అనుకోకుండా ఆ సలార్ రాజు కనిపించకుండా పోతాడు. దీంతో ఊరంతా గందరగోళంలో పడుతుంది. ఇంతకీ సలార్ రాజు ఎవరో కాదు.. కోళ్ల పందెల్లో పాల్గొనాల్సిన కోడిపుంజు. దీన్ని వెతకటానికి ఇద్దరు పోలీసులు(గెటప్ శీను, రవితేజ నన్నిమల) ఊళ్లోకి వస్తారు. సలార్ రాజు కనిపించకపోవటం వల్ల..ఎవరికి లాభం అనే కోణంలో పోలీసులు అన్వేషిస్తుంటారు. అయితే వారికి ఊళ్లో మరో సమస్య కనిపిస్తుంది. ఇంతకీ సలార్ రాజు దొరికాడా? లేదా? అనే విషయాలు తెలియాలంటే ఈనెల 22న జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. నాగబాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌ను రా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బి.వి.ఎస్. రవి, కౌముది కె నేమాని నిర్మాతలుగా ప్రదీప్ మద్దాలి క్రియేటివ్‌తో కలిసి రూపొందింది. ‘వికటకవి’ డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. శోభన్ చిట్టుప్రోలు కథను అందించారు.



