Tuesday, July 14, 2026
E-PAPER
Homeసినిమాఈ మధ్య కాలంలో రాలేదు

ఈ మధ్య కాలంలో రాలేదు

- Advertisement -


ఫ‌హాద్ ఫాజిల్ హీరోగా ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి సమ‌ర్ప‌ణ‌లో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’.
శశాంక్ యేలేటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 11న రిలీజ్ చేయబోతున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను సోమవారం రిలీజ్ చేశారు. నిర్మాత ఎస్.ఎస్ కార్తికేయ మాట్లాడుతూ,’ఫహాద్ ఫాజిల్ తో సినిమా నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. టీజర్ అందరికీ నచ్చే ఉంటుంది. ఇది మనసుకు హత్తు కునే చిత్రం. ఇకపై నుంచి రాబోయే కంటెంట్‌ని చూస్తే ఆ విషయం మీకే అర్థం అవుతుంది. ‘వారణాసి’ ప్రారంభం కంటే ముందే ఈ చిత్రం పూర్తి అవ్వాల్సింది. పహాద్ ఫస్ట్ నెరేషన్‌లోనే ఈ కథని ఓకే చేశారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి జోనర్‌లో సినిమా రాలేదు. ఈ చిత్రంలో చాలా వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. రాజమౌళి స్టాంప్ పడ్డ తర్వాతే స్క్రిప్ట్ లాక్ అయింది. మూవీ అంతా పూర్తయ్యాక మళ్లీ ఆయనకు చూపించి సలహాలు తీసుకుంటాం’ అని అన్నారు. ‘అందరూ చూసి ఎంజాయ్ చేసేలా మా చిత్రం ఉంటుంది. దక్షిణాది భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాంఅని నిర్మాత శోభు యార్లగడ్డ చెప్పారు. ఆడియో బైట్ ద్వారా ఫహాద్ ఫాజిల్ మాట్లాడుతూ, 'తెలుగులో ఒక స్ట్రెయిట్ సినిమా చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. శశాంక్ చెప్పిన కథ నాకు ఎంతో నచ్చింది. ఇలాంటి మంచి ఫాంటసీ డ్రామా ఎలిమెంట్స్ ఉన్న సినిమా చేయడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. ‘ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేలా మా సినిమా ఉంటుంది. ఫహాద్ తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఆయనకి కథ చాలా నచ్చింది. సెట్‌కి వచ్చాక స్క్రిప్ట్‌కి సరెండర్ అవుతారు. సారా అద్భుతంగా నటించింది అని దర్శకుడు శశాంక్ యేలేటి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -