వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయి అభిషేక్ నిర్మాణంలో, డైరెక్టర్ గొండి మణితేజ తెరకెక్కి స్తున్న 'ఓరి నాయనో సినిమా టైటిల్‌తో పాటు, సినిమా కార్యాల యాన్ని ముఖ్య అతిథి హీరో నవీన్ చంద్ర ఆవిష్కరిం చారు. మాదాపూర్‌లోని వీరాంజనేయ ప్రొడక్షన్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో ‘మా ఊరి పొలిమేర’ డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్, నటులు సత్యం రాజేష్, రాజా రవింద్ర, డీవోపీ వెట్రి పళనిస్వామితో పాటు చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు గొండి మణితేజ మాట్లాడుతూ,’నా హృదయానికి దగ్గరైన ఒక కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మొదటి అడుగు ఈ పూజతో పడింది. ప్రేక్షకులకు వినోదాన్ని అందించ డంతో పాటు గుర్తుండిపోయే పాత్రలు, మధురక్షణాలను అందించే చిత్రాన్ని రూపొందిస్తున్నాంఅని తెలిపారు. 'ఈ చిత్రాన్ని ఉన్నత నిర్మాణ విలువలతో, ప్రతిభా వంతమైన సాంకేతిక బృందంతో నిర్మిస్తున్నాం. విభిన్నమైన కథలను ప్రోత్సహించడం, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కమర్షియల్ సినిమాలను అందించడం వీరాంజనేయ ప్రొడక్షన్స్ లక్ష్యం అని నిర్మాత సాయి అభిషేక్ చెప్పారు..
ఈ చిత్రం వినోదం, భావోద్వేగాలు, ఆధునిక కథనాన్ని సమ్మిళితం చేసిన కొత్త తరహా కథతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా, వినోదంతో పాటు అనూహ్య మలుపులు, నేటి సమాజాన్ని ప్రతిబింబించే పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుందని చిత్రయూనిట్ తెలిపింది.
సరికొత్త కథతో ‘ఓరి నాయనో
- Advertisement -
- Advertisement -



