హైదరాబాద్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించిన భారత ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌కు హెచ్‌సీఏ రూ.10 లక్షల ప్రైజ్‌మనీ ప్రకటించింది. చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుకు టీమ్ మేనేజర్‌గా వ్యవహరించిన ఆర్. దేవరాజ్‌కు సైతం నజరానా ప్రకటించినా.. ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు తెలిపారు. బీసీసీఐ ఆదేశాల ప్రకారం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) లేవనెత్తిన అంశాల అధ్యయనం, పరిష్కారం కోసం ఏడుగురు సభ్యుల కమిటీని నియమిస్తూ హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్టు హెచ్‌సీఏ ఓ ప్రకటనలో తెలిపింది.