అవినీతితో కోట్లల్లో ఆస్తులను సంపాదించారు
ఏఎస్‌పీ భుజంగరావు ఆస్తులపై ఏసీబీ దాడుల్లో వెల్లడి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఫోన్‌ట్యాంపింగ్‌లో చక్రం తిప్పారు. అవనీతి అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. ఆయన ఆస్తులు ప్రాధమిక లెక్కలో ఐదుకోట్లకుపైగా ఉండగా, మార్కెట్‌రేట్లలో అది నాలుగైదు రేట్లు ఎక్కువగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారూసిన్హా బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. అదనపు ఎస్‌పీ భుజంగరావు గత రెండేండ్ల క్రితమే అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ఫోన్‌ట్యాపింగ్‌లకు పాల్పడ్డారనే నేరంపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా జరిపించిన సిట్ విచారణలో భుజరంగరావును అరెస్టు చేసి, సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు మూడు నెలలకుపైగా జైళ్లో ఉన్న భుజంగరావు తరువాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసు ఒకపక్క సాగుతుండగా తాజాగా ఏసీబీ అధికారులు నిఘా వేసి భుజంగరావు సంపాదించిన గుట్టు రట్టుచేశారు. చారూసెన్హా ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ ప్రత్యేక బృందాలు నగరంలోని భుజంగరావు నివాసంతోపాటు మరో 17ప్రాంతాలల్లో ఆకస్మిక దాడులను నిర్వహించారు.
ఇందులో అతని కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులు, బినామీల నివాసాలున్నాయి. ఈ దాడులు నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో జరిగాయి. సాయంత్రం వరకు సాగిన సోదాలల్లో ఏసీబీ కనిపెట్టిన భుజంగరావు అక్రమాస్తులు ఇలా ఉన్నాయి. సూర్యాపేటలో 27.29ఎకరాల వ్యవసాయ భూమి, నగరంలో ఐదు ఓపెన్‌ప్లాట్లు, రెండు ఇండ్లు, ఒక కమర్షియల్ భవనాన్ని ఏసీబీ అధికారులు కనుగొన్నట్టు తెలిసింది. అలాగే ఆయన నివాసంలో రూ.3లక్షల 83వేల నగదు, ఒక కిలో బంగారు నగలు, రూ.9లక్షల బ్యాంక్ బ్యాలెన్‌్స , ఒక మారుతీ షిఫ్ట్ కారు, మరో కియోకారు భుజంగరావు కలిగి వున్నట్టు కనిపెట్టారు. పాథమికంగా వీటివిలువ రూ.5కోట్ల 92లక్షల 54వేలుగా ఏసీబీ అధికారులు అంచనా వేశారు. ఈ ఆస్తులు ప్రస్తుత బహిరంగమార్కెట్ విలువ నాలుగైదురెట్లకంటే అధికంగా ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే భూజంగరావు ఇంటినుంచి 29 విలువై మద్యం బాటిళ్లను స్వాధీన పర్చుకున్న ఏసీబీ అధికారులు తపదుపరి దర్యాప్తు కోసం వీటిని ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. కాగా భూజంగరావుపై ఆదాయానికిమించిన ఆస్తుల కేసునమోదు చేసిన సిట్ అధికారులు నిందితులను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. మరోవైపు ఫోన్‌ట్యాంపింగ్ కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన మరో ఇద్దరు అధికారుల అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఫోన్‌ట్యాపింగ్‌లో చక్రం తిప్పారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



