సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: హెడ్ కానిస్టేబుల్ ధనసరి వెంకన్న

– కాటాపూర్, రంగాపూర్ గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు 
నవతెలంగాణ -తాడ్వాయి
సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, మోసాలపై అప్రమత్తంగా ఉండాలని తాడ్వాయి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ధనసరి వెంకన్న అన్నారు. శుక్రవారం మండలంలోని కాటాపూర్, రంగాపూర్ గ్రామాల్లో పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటీపీ లు, ఏటీఎం కార్డు, పిన్ నెంబర్లు, వ్యక్తిగత సమాచారం ఎవరికి చెప్పవద్దన్నారు. రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, ఎందరో అభాగ్యులు నష్టపోతున్నారని అన్నారు. ఫిర్యాదులుంటే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి పోలీసులు ఆర్మీ రమేష్, సంధ్యానందా, గొంది రవీందర్, యూత్ నాయకులు, గ్రామస్తులు, మహిళలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love