– 70,750 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
నవతెలంగాణ-చర్ల
అల్పపీడనద్రోణితో సరిహద్దు చత్తిస్‌గడ్‌లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తాలిపేరు నది పర్వాలు తొక్కుతూ తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టును చేరడంతో ప్రాజెక్టుకి జలకల సంతరించుకుంది. ఎగువ నుండి 70,750 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుకోవడంతో అధికారులు ప్రాజెక్టుకు ఉన్న 25 గేట్లకు గాను ఐదు గేట్లను పూర్తిగా ఎత్తి 20 గేట్లను రెండు అడుగుల మేర లేపి 70,750 క్యూసెక్కుల నీటిని దిగువున్న గోదావరిలోకి వదులుతున్నారు. ఈ వర్షాకాలం సీజన్ ప్రారంభం అయిన దగ్గర నుండి బుధవారం మొట్టమొదటిసారిగా తాలిపేరు ప్రాజెక్టుకు అధికంగా వరద నీరు చేరుకుంది. ప్రాజెక్టు సరాసరి సామర్థ్యం 74 మీటర్లు కాగా అధికారులు 73 మీటర్ల నీటిని నిలువ ఉంచి అధికంగా వచ్చిన వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు డీఈ తిరుపతి తెలిపారు.