- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రంలోని పలుచోట్ల వర్షం మొదలైంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్ ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. ఈ అకాల వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పలుచోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. అయితే, ఎండ వేడిమితో అల్లాడిపోయిన నగరవాసులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. అటు వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
- Advertisement -



