నవతెలంగాణ – హైదరాబాద్: భారత టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ తొలిసారి సోషల్ మీడియాలో స్పందించాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో భారత క్రికెట్ జట్టు ఫొటోను షేర్ చేశారు. ‘‘ఎంతో ప్రతిభావంతులైన ఈ ఆటగాళ్ల బృందానికి నా శుభాకాంక్షలు. రాబోయే సవాళ్లలో ఈ జట్టు విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని సూర్యకుమార్ రాసుకొచ్చాడు. కెప్టెన్సీ పోయినప్పటికీ జట్టుకు మద్దతుగా నిలిచిన అతడి క్రీడాస్ఫూర్తిని అభిమానులు మెచ్చుకుంటున్నారు. మరో పోస్ట్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని సూర్యకుమార్ అభినందించాడు. టీమ్‌ఇండియాకు వైభవ్ ఎంపికవ్వడంపై హర్షం వ్యక్తం చేశాడు. ‘‘నువ్వు ఈ అవకాశాన్ని కష్టపడి సంపాదించుకున్నావు. నీ క్రికెట్ ప్రయాణాన్ని చూడటానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 776 పరుగులు చేసిన 15 ఏళ్ల వైభవ్‌ను సూర్య మనస్ఫూర్తిగా అభినందించడం విశేషం.
కెప్టెన్‌గా తొలగింపు.. సూర్యకుమార్ ఫస్ట్ రియాక్షన్ ఇదే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



