నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో భూకబ్జాల వ్యవహారం ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వర్సెస్ కవితగా మారి సరికొత్త వివాదానికి తెరలేపింది. హైదరాబాద్‌లోని ‘కోటిచెరువు’ శిఖం భూమిని పవన్ కల్యాణ్ కబ్జా చేశారంటూ టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని పార్టీ ఆఫీస్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆమె మాట్లాడుతూ.. పవన్ గనుక ఆ భూమిని ఆక్రమించలేదని చెబితే, వెంటనే ఆ స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించి, అక్కడి నిర్మాణాలను, మట్టిని తొలగించాలని డిమాండ్ చేశారు. నీటిపారుదల శాఖ రికార్డుల ప్రకారం ఆ 10 ఎకరాల భూమి పూర్తిగా ‘శిఖం’ (ప్రభుత్వ) భూమి అని కవిత స్పష్టం చేశారు. కానీ రిజిస్ట్రేషన్ సమయంలో కేవలం 3 ఎకరాలను మాత్రమే శిఖం భూమిగా చూపి, మిగిలిన 7 ఎకరాలను ‘మాగాణి’ (ప్రైవేట్) భూమిగా మార్చేశారని.. ఇది స్పష్టమైన నిబంధనల ఉల్లంఘనే అని ఆమె ఎండగట్టారు.
కోటి చెరువు శిఖం భూమిని పవన్ కబ్జా చేశారు: కవిత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



