నాగిరెడ్డి పేటలో భారీ వర్షం..

– ఆనందంలో రైతన్నలు..
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
జూన్ నెల మొదటి వారం నుండి వరుణుడి కోసం ఎదురుచూస్తున్న రైతన్నకు జూన్ చివరి వారంలో వరణుడు కరుణించాడు. శనివారం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీగా వర్షం కురిసింది. గత 15 , 20 రోజుల నుండి పొలాల్లో దుక్కులు దున్ని నారువేసి వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతన్నకు శనివారం కొద్దిగా ఊరట లభించింది. వర్షాలు పడతాయా లేదా అసలేంటి పరిస్థితి. ఖరీఫ్ సీజన్ అనుకూలించెన లేదా అనే అయోమయ పరిస్థితిలో అన్నదాత విలవిలలాడిపోయారు. ఎట్టకేలకు శనివారం రోజు వాతావరణంలో మార్పు వచ్చి ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వీధులన్నీ జలమయమయ్యాయి. ఇక వర్షాకాలం అయినట్లే అని నాట్లు వేయడానికి రైతులంతా సిద్ధమయ్యారు.

Spread the love