నవతెలంగాణ – అమరావతి: తిరుమలలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దాదాపు గంటకుపైగా కురిసిన వర్షంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. ఆలయ పరిసరాలు, మాడవీధుల్లో వరద నీరు చేరి చెరువును తలపించింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు వర్షంలో తడిసిముద్దయ్యారు. దీంతో ప్రస్తుతం భక్తులు బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు.