- Advertisement -
నవతెలంగాణ -అచ్చంపేట
మృతి చెందిన శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ముళ్ల పొదల్లో పడేసిన ఘటన అచ్చంపేట పట్టణంలోని విద్యానగర్ కాలనిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున మృతి చెందిన శిశువును సమీప చేట్ల పొదలో పడేసినట్టు చెప్పారు. శిశువును కుక్కలు పీక్కుతింటున్న హృదయ విదారకర ఘటనను చూసి మనసు చలించిపోయిందని అన్నారు. మనుషులు కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించామని, ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని గుర్తించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
- Advertisement -



