నవతెలంగాణ – సిరికొండ
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
అతివేగంగా విచిన ఈదురు గాలులకు మండల కేంద్రంలోని హోండా షోరూం వద్ద వున్నా నేమ్ ప్లేట్లు ఊడిపోయి సమీపంలోని విద్యుత్ స్తంభంపై వేలాడింది. ప్రతిభ స్కూల్ వద్ద రోడ్డుకు అడ్డంగా చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా తాళ్ల రామడుగు గ్రామానికి వెళ్లే దారిలో చెట్లు విరిగిపోయి రోడ్డుకు అడ్డంగా పడడంతో గ్రామస్తులు వెంటనే చెట్లను తొలగించారు. అదే రోడ్డుపై విద్యుత్ స్తంభం రోడ్డుకు అడ్డంగా పడిపోయి విద్యుత్ సరఫరకు అంతరాయం కలిగించింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం.
సిరికొండలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



