Sunday, September 13, 2026
E-PAPER
Homeజాతీయంక్యాష్ ఆన్ డెలివరీపై బాదుడు

క్యాష్ ఆన్ డెలివరీపై బాదుడు

- Advertisement -

జోమాటో అదనపు చార్జీలు
న్యూఢిల్లీ
: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో వినియోగదారులపై మరోసారి ఆర్థిక భారం మోపింది. క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) విధానంలో ఆర్డర్ చేసే కస్టమర్లపై అదనంగా రూ.5 వసూలు చేస్తోంది. ప్రస్తుతం ఈ చార్జీలు కంపెనీ బిల్లులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కంపెనీ ఆదాయాన్ని మరింత పెంచుకోవడంతో పాటు, డిజిటల్ చెల్లింపుల వైపు వినియో గదారులను మళ్లించే ఉద్దేశంతోనే జొమాటో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఆన్‌లైన్ ద్వారా ముందుగానే చెల్లింపు చేసే వారికి ఈ అదనపు ఛార్జీల నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇప్పటికే ఫుడ్ ఆర్డర్లపై ప్లాట్‌ఫాం ఫీజు, రెస్టారెంట్ ప్యాకేజింగ్ ఛార్జీలు, జిఎస్‌‌టి వసూలు చేస్తున్న జొమాటో.. తాజాగా సీఓడీ చార్జీలను కూడా కలపడంతో వినియోగదారులపై భారం మరింత పెరగనుంది. కొద్ది రోజులకు ముందే జొమాటో తన ప్లాట్‌ఫాం ఫీజును రూ.12.50 నుంచి రూ.14.90కి పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ రంగంలో పోటీ తీవ్రతరమవుతోంది. మార్కెట్లో కొత్త కంపెనీలు ప్రవేశిస్తుండటంతో పాటు, లాభాలను ఆర్జించే లక్ష్యంతో జొమాటో ఈ రకమైన రుసుములను క్రమంగా అమలు చేస్తోంది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -