Tuesday, May 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కటాక్షపూర్ కోటగుళ్ల వద్ద హెరిటేజ్ వాక్ : డీటీఓ శివాజీ

కటాక్షపూర్ కోటగుళ్ల వద్ద హెరిటేజ్ వాక్ : డీటీఓ శివాజీ

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “99 రోజుల కార్యాచరణ – ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక”లో భాగంగా జిల్లాలో పర్యాటక అభివృద్ధి, వారసత్వ సంపద పరిరక్షణ లక్ష్యంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం. శివాజీ తెలిపారు. మే 20న బుధవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షాపూర్ గ్రామంలోని కాకతీయుల కాలం నాటి త్రికూటాలయం ( కోట గుళ్ళు) వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, కుడా చైర్మన్, డిసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకటరామిరెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పాల్గొననున్నారు. వీరితో పాటు పర్యాటక, హెరిటేజ్, క్రీడలు, డీపీఆర్వో, డీఈవో శాఖల అధికారులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారని డీటీఓ పేర్కొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -