ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు

– ఆయిల్ ఫామ్ సాగుపై పెద్దగుండవెళ్ళి లోఅవగాహన 
– శాస్త్రవేత్త డా. బీ ఎన్ రావ్, అర్టికల్చర్ 
– హెచ్వోలు అనిల్, భాస్కర్ రెడ్డి 
నవతెలంగాణ-దుబ్బాక రూరల్ :  ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని అందుకు అనుగుణంగా ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తుందని అర్టికల్చర్ శాస్త్రవేత్త డా. బీ ఎన్ రావ్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలోశుక్రవారం గ్రామ సర్పంచ్ సద్ది రాజి రెడ్డి ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు పై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫామాయిల్ సాగుతో రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. అంతక ముందు ఆయిల్ ఫామ్   మొక్కలు ఎలా పెంచాలనీ , పెంపకం దశ నుండి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా వహించాలని శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. కార్యక్రమంలో అర్టికల్చర్ హెచ్వోలు అనిల్, భాస్కర్ రెడ్డి , గ్రామ ఉప సర్పంచ్ స్వప్న రవి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నక్కల రాఘ రెడ్డి,అగ్రికల్చర్ ఏవో ప్రవీణ్, ఏఏవో అరుంధతి,  రైతులు నిమ్మ సత్తిరెడ్డి తదితరులు ఉన్నారు
Spread the love