- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్, ఆయన బంధువుల ఇండ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, నిజామాబాద్‌తో పాటు మరో 10 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో కిలో బంగారం, కిలోకుపైగా వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రవీందర్ పేరిట రూ.50 కోట్లకుపైగా ఆస్తులను గుర్తించారు. కొండాపూర్‌లో 2 ప్లాట్లు, మసీద్‌బండలో 4 అంతస్తుల భవనం, సుమదుర ఆక్రోపోలిస్‌లో ఫ్లాట్ తదితర ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.
- Advertisement -



