చిన్న తరహా గృహ రుణాల కోసం రూ.150 కోట్లు సేక‌రించిన హోమ్ ఫైనాన్స్

Vridhi Home Finance Teamబెంగళూరు: బిఎఫ్‌ఎస్‌ఐ మరియు ఎఫ్‌ఎంసిజి రంగాలలో 25 ఏళ్లకు పైగా విశేష అనుభవం కలిగిన శ్రీ సుంకు రామ్ నరేష్ ఈ కంపెనీ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటవ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. మరియు సహ వ్యవస్థాపకులు గా శ్రీ సందీప్ అరోరా (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్), శ్రీ సునీల్ మెహతా (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్) బెంగళూరు కేంద్రంగా వృద్ధి హోమ్ ఫైనాన్స్‌ను 2022లో ప్రారంభించారు. చిన్న తరహా గృహ రుణాలను అందించేందుకు, వ్యాపారాన్ని మరింతగా పెంచుకునేందుకు సిరీస్ ఏలో భాగంగా ఎలివేషన్ క్యాపిటల్ నుండి రూ.150 కోట్లను సమీకరించినట్లు ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ వృద్ధి హోమ్ పైనాన్స్ ప్రకటించింది. ఈ సేకరించిన నిధులతో వ్యాపారాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించడం, సాంకేతికతను బలోపేతం చేయడం, రాబోయే బ్రాంచ్‌ల్లో మౌలిక వసతుల మరియు ఉద్యోగ కల్పన కోసం ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి, కర్నూలు, నెల్లూరు, హిందూపురం, మదనపల్లె, అనంతపురం, ధర్మవరం మరియు కర్నాటకలోని బెంగళూరు, హోసకోట్, నేలమంగళ, చందాపుర, కెంగేరి, బంగారుపేట, చిక్కబల్లాపుర, మైసూర్, మద్దూర్,  తుమకూరు, బీదర్, హుబ్లీ, బెలగావి, గుల్బర్గా పట్టణాల్లో ఇరవై శాఖలను వృద్ధి హోమ్ ఫైనాన్స్ కంపెనీ ప్రారంభించింది. ‘ఏడాది సమయంలోనే వృద్ధి హోమ్ ఫైనాన్స్ వందలాది మంది వినియోగదారులకు సగటున రూ. 8-10 లక్షల పరిమాణంతో గృహ రుణాలను పొందడంలో సహాయం చేసింది. సహ వ్యవస్థాపకులు మరియు వ్యవస్థాపక బృందం మధ్య 75 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న వృద్ధి హోమ్ ఫైనాన్స్… భారతదేశంలోని చిన్న, మధ్య తరహా నగరాల్లో వేతనాలు మరియు స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు సేవలందిస్తూ, వారికి గృహ రుణాలను అందిస్తూ సరికొత్త అవకాశాలను రూపొందించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సందర్భంగా వృద్ధి హోమ్ ఫైనాన్స్ వ్యవస్థాపకుడు, ఎండీ మరియు సీ.ఈ.ఓ. అయినటువంటి శ్రీ సుంకు రామ్ నరేష్ మాట్లాడుతూ… “ఎలివేషన్ క్యాపిటల్‌తో మా గౌరవప్రదమైన భాగస్వామ్యాన్ని గుర్తించి, మాకు మద్దతును అందించిన వారందరికి మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. ఈ గణనీయమైన పెట్టుబడి పెరుగుదలతో, గృహ పరిష్కారాలను అందించే మా మిషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాము. చిన్న పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాలలో చిన్న తరహా వేతన దారులకు, స్వయం ఉపాధిదారులకు రుణాలు పొందడం కష్టాంగా ఉంటుంది, వారి సొంతింటి కళను నిజం చేయటానికి వృద్ధి కట్టుబడి ఉంది. మేము సాగిస్తున్న మా ప్రయాణం చాలా ఆశాజనకంగా కొనసాగుతోంది. అంతేకాకుండా ఈ విభాగానికి సరళమైన మరియు సురక్షితమైన  గృహ రుణాలను అందించేందుకు అంకితభావంతో ఉన్నామని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారతదేశం యొక్క మార్ట్ గేజ్ మార్కెట్ చాలా తక్కువగా ఉంది. జిడిపిలో మార్ట్ గేజ్ రుణాల పెనట్రేషన్ కేవలం 11%, ఈ రంగంలో ఇంకా ఎన్నో అద్భుతమైన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నమ్ముతున్నాం. ఇప్పటివరకు గృహాలకు సంబంధించి హోమ్ ఫైనాన్స్ తీసుకోని వారి టార్గెట్ గా మేము పనిచేస్తాము, తద్వారా ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలాన్ని చేకూరిస్తుంది. వృద్ధి బృందం యొక్క అసమానమైన అనుభవం భారతీయులకు అందుబాటులో ఉండేలా చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ విజన్‌ని నిజం చేసేందుకు వారితో భాగస్వామ్యం కావడానికి మేము సంతోషిస్తున్నాము” అని ఎలివేషన్ క్యాపిటల్ భాగస్వామి శ్రీ మ్రిదుల్ అరోరా తెలిపారు. రాబోయే రోజుల్లో భారతదేశంలో సెమీ-అర్బన్ మరియు గ్రామీణ ప్రాంతాలకు క్రెడిట్ యాక్సెస్‌ను విస్తరించేందుకు వృద్ధి కట్టుబడి ఉంది.

Spread the love