Tuesday, May 12, 2026
E-PAPER
Homeక్రైమ్హోంగార్డు ఆత్మహత్య

హోంగార్డు ఆత్మహత్య

- Advertisement -

– ఇంటి ప్లాట్‌ విషయంలో గొడవ
– వికారాబాద్‌ జిల్లా దోమ మండలంలో ఘటన
నవతెలంగాణ-దోమ

ఇంటి ప్లాట్‌ విషయంలో గొడవ జరగడంతో ఓ హోంగార్డు మనస్తాపానికి గురై చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వికారాబాద్‌ జిల్లా దోమ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాస్పల్లి గ్రామానికి చెందిన తలారి వెంకటయ్య(47) వికారాబాద్‌ ఎస్పీ కార్యాలయం లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే గ్రామంలోని తన ఇంటి వెనకాల ఉన్న 60 గజాల స్థలాన్ని అదే గ్రామానికి చెందిన కుందేళ్ల చంద్రయ్య వద్ద 40 ఏండ్ల క్రితం అతని తండ్రి కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి ఆ స్థలానికి ఎలాంటి ఫెన్షింగ్‌ చేయకుండా ఖాళీగా ఉంది. కాగా, ఇటీవలే ఆ స్థలానికి ఫెన్షింగ్‌ చేసుకునేందుకు కడ్డీలను పాతేందుకు వెళ్లాడు. కడ్డీలను పాతుతుండగా కుందేళ్ల చంద్రయ్య మనుమడు కుందేళ్ల మల్లేశ్‌ ఈ స్థలం తమదని, ఈ ప్రాంతంలో కడ్డీలను పాతడానికి వీలు లేదని గొడవకు దిగాడు. పాతిన కడ్డీలను విరగొట్టడంతో మనస్తాపానికి గురైన హోంగార్డు తన పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్‌ అనంతయ్య పోలీసులకు సమాచారం అందిం చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేసుకుని మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతునికి భార్య విజయలక్ష్మి, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కుందేళ్ల మల్లేష్‌పై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ వసంత్‌జాదవ్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -