Saturday, August 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఘోర రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్ సజీవదహనం

ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్ సజీవదహనం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో పోలేకమ్మ గుడి సమీపంలో జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గోధుమల లోడుతో వెళ్తున్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ కిరణ్ సజీవ దహనమయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే లారీలో మంటలు చెలరేగడంతో డ్రైవర్ బయటకు రాలేకపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -