భారీ వర్షాలకు నేలకొరిగిన ఇండ్లు..

నవతెలంగాణ -భిక్కనూర్
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఇంట్లో కూలిపోయాయి. మండల కేంద్రంలో సాజిద్ కు చెందిన నివాసపు ఇల్లు వర్షాలకు కూలిపోయి, ఇంట్లో ఉన్న వస్తువులు ధ్వంసం అయ్యాయి. తిప్పాపూర్ గ్రామానికి చెందిన మధుకర్ రెడ్డి నివాసపు ఉంటున్న ఇల్లు ఒక భాగం పూర్తిగా కూలిపోయిగా, ఇంట్లో ఉన్న వంట సామాగ్రి ఇతర వస్తువులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.కాచాపూర్, పెద్ద మల్లారెడ్డి గ్రామాలలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లు నేలకొరగా, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఎవరు నివాసం ఉండవద్దని తాసిల్దార్ ప్రేమ కుమార్ తెలిపారు.

Spread the love