గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాల ప్రమాదాలను అధైర్య పడకుండా ఎంతోచాకచక్యంగా నేర్పుతో ఎదుర్కోవాలని ఎన్ డి ఆర్ ఎఫ్ ఇన్స్పెక్టర్ భూపేంద్ర కుమార్ ఏఎస్ఐ నరేంద్ర సింగ్ అన్నారు. మంగళవారం మండలంలోని ప్రాజెక్టు నగర్ గ్రామంలో ప్రకృతి వైపరీత్యాలు వరదలు వంటి సమయంలో ప్రజలు ఎలా నేర్పుగా వ్యవహరించాలి ప్రమాదాల నుంచి ఎలా గట్టక్కాలి అనే విషయాలను ప్రాక్టికల్ గా ప్రజలకు ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు చూపించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలో మెలకువలను చూపించారు. ఏలాంటి ప్రాణ నష్టం జరగకుండా వరదలను ఎదుర్కొనే మార్గాలను అవలంబించే పద్ధతులను ప్రజలకు చూపించారు. గత సంవత్సరం వరదల్లో ఈ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కొట్టుకుపోయి మృతి చెందడంతో ఈ సంవత్సరం ప్రభుత్వం అన్ని రకాలుగా వరదలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు దీనిలో భాగంగా నేడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రాజెక్టు నగర్ గ్రామ ప్రజలకు ప్రకృతి వైపరీత్యాల నుంచి బయటపడేందుకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సృజన్ కుమార్ ఎంపీ ఓ సాజిదా బేగం అగ్నిమాపక శాఖ మరియు అటవీశాఖ అధికారులతో పాటు పోలీసులు స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు ప్రజలు పాల్గొన్నారు.