భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు..

నవతెలంగాణ –  హైదరాబాద్: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియగానే ఆయా రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి. మొన్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పెంచేయగా.. తాజాగా గోవా రాష్ట్రం కూడా అదే బాటలో నడుస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ పెంపును గోవా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పెట్రోల్ ధర రూ.1, డీజిల్ ధరను 60 పైసలు పెంచుతూ.. ధరల పెరుగుదల జూన్ 22 నుంచి అమలులోకి వస్తాయని స్టేట్ గవర్నమెంట్ అండర్ సెక్రటరీ ప్రణబ్ జి భట్ శుక్రవారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ధరల పెరుగుల తర్వాత గోవాలో లీటరు పెట్రోల్ ధర రూ. 95.40, డీజిల్‌ రూ. 87.90 గా ఉంది.

Spread the love