
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్ : రాఖీ పండుగ సందర్భంగా హుస్నాబాద్ డిపో అత్యధిక ఆదాయం రూ .12,74,938 తీసుకువచ్చి రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలవడంతో శనివారం హుస్నాబాద్ ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులలో 31793 మంది ప్రయాణికులను వారి వారి గమ్య స్థానాలకు చేర్చి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగవ స్థానం నిలిచిందన్నారు. కరీంనగర్ రీజియన్ లో రెండవ స్థానంలో హుస్నాబాద్ నిలిచిందన్నారు. హుస్నాబాద్ ఆర్టీసీ ఉద్యోగుల కృషికి ఆర్టీసీ ఎండి స్వయంగా ఫోన్ చేసి డిపో సిబ్బంది అందరికి అభినందనలు పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ఇక ముందు కూడా అత్యధిక ఓఆర్ తీసుకువచ్చి డిపోను లాభాల బాటలో తీసుకురావాలని కోరారు.